China: కోవిడ్-19పై అమెరికాలో పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత కాల్చివేత

China Researcher shot dead in America
  • తన ఇంట్లోనే హత్యకు గురైన బింగ్ లియు
  • హో గు అనే వ్యక్తి కాల్చి చంపినట్టు అనుమానం
  • నిందితుడి మృతదేహం గుర్తింపు
అమెరికాలో చైనా పరిశోధకుడు హత్యకు గురికావడం సంచలనమైంది. కోవిడ్-19పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్త బింగ్ లియు (37) పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. శనివారం ఆయన పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన వున్న రాస్ టౌన్‌షిప్‌లోని తన ఇంట్లో శవమై కనిపించారు.

హోగు అనే 46 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆయనను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకుని మరణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హోగు, బింగ్ లియు ఇద్దరూ పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. లియు పరిశోధనలకు, ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
China
USA
scientist murder
COVID-19

More Telugu News