USA: లాక్ డౌన్ ఎత్తివేత ఫలితం... అమెరికాలో ఒక్కరోజులో 20 వేల కొత్త కేసులు!

20 thousand New Corona Cases in USA

  • న్యూయార్క్ లో తగ్గుతున్న కేసులు
  • ఇతర ప్రాంతాల్లో కరోనా బీభత్సం
  • ఇన్ఫెక్షన్ అదుపులోకి రాకుంటే మరణాలు అధికమే
  • హెచ్చరించిన శాస్త్రవేత్తలు

నిన్నమొన్నటి వరకూ కరోనా విలయతాండవం చేసిన న్యూయార్క్ లో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతుండగా, మిగతా ప్రాంతాల్లోనూ, అందునా లాక్ ‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఒక్కరోజులో సుమారు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా, వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. లాక్ ‌డౌన్‌ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణమని, ఇన్ఫెక్షన్‌ రేటును అదుపు చేయకుంటే ఎంతోమంది మరణించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందవచ్చని అంచనా వేశారు.

కాగా, యూఎస్ మొత్తం మీద కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, న్యూయార్క్,‌ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే మాత్రం గడచిన ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు 6.2 నుంచి 7.5కు పెరిగినట్టు తెలుస్తోంది. న్యూయార్క్ కరోనా‌ మరణాలు తగ్గగా, మిగతా ప్రాంతాల్లో పెరిగాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. కరోనా టెస్టింగ్స్ అధికంగా చేయడం వల్లనే కేసుల సంఖ్య అధికంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న వాదన సరికాదని, వాస్తవంగానే కేసులు పెరిగిపోతున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్‌ జాంగ్‌ తెలిపారు.

USA
Corona Virus
New Cases
Deaths
NewYork
  • Loading...

More Telugu News