Nithin: నితిన్ జోడీగా మరో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్

Power Peta Movie

  • నితిన్ తాజా చిత్రంగా 'రంగ్ దే'
  • లైన్లో రెండు ప్రాజెక్టులు
  • 'పవర్ పేట'లో కీర్తి సురేశ్  


'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల  హృదయాలను దోచుకున్న కీర్తి సురేశ్, ఆ తరువాత తెలుగు .. తమిళ సినిమాల్లో తన జోరు చూపిస్తూ వెళుతోంది.  తెలుగులో ఆమె చేస్తున్న సినిమాల్లో 'రంగ్ దే' ఒకటి.  నితిన్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.  వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది.  లాక్  డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు  ఆగిపోయింది.

ఈ సినిమాలో  కీర్తి సురేశ్ తన పాత్రలో ఇమిడిపోయిందిట. ఆమె నటన ..  నటన పట్ల ఆమెకి గల అంకితభావాన్ని చూసిన నితిన్, మరో సినిమాలోనూ కథానాయికగా ఆమెనే తీసుకున్నాడని తెలుస్తోంది. 'రంగ్ దే' తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన 'పవర్ పేట' చేయనున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టుగా తెలుస్తోంది.  ఇటు 'రంగ్ దే' చిత్రంలో .. అటు 'పవర్ పేట' మూవీలో నితిన్ సరసన నాయికగా కీర్తి సురేశ్ ఏ స్థాయిలో మార్కులు కొట్టేస్తుందో చూడాలి.

Nithin
Keerthi Suresh
Krishna Chaitanya Movie
  • Loading...

More Telugu News