GVL Narasimha Rao: కేంద్రం ఆదేశిస్తేనే మద్యం విక్రయిస్తున్నామనడం కరెక్టు కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL Statement

  • రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీల అపోహలు
  • రాష్ట్రాల వినతుల మేరకు కొన్ని సడలింపులు 
  • మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే

రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. వివిధ రాష్ట్రాల వినతుల మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిందని, మద్యం విక్రయాలపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసిందని స్పష్టం చేశారు.

కేంద్రం ఆదేశించడం వల్లే రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుపుతున్నామని ఏపీ మంత్రులు చేసిన ప్రకటనలు కరెక్టు కాదని అన్నారు. ఏపీ మంత్రులు చెబుతున్నదే నిజమైతే,  మిగతా రాష్ట్రాల్లో మద్యం ఎందుకు విక్రయించడం లేదు? అని ప్రశ్నించారు.

GVL Narasimha Rao
BJP
Liquor
sales
Andhra Pradesh
  • Loading...

More Telugu News