Bhuma Akhila Priya: లాక్ డౌన్ లో వైసీపీ నాయకుల కోసం దేవాలయాలు ఎందుకు తెరిచారు?: భూమా అఖిలప్రియ

TDP Leader criticises ysrcp leaders

  • ఇవాళ స్వాతి నక్షత్రం ..నరసింహ జయంతి
  • అహోబిలంకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లారు
  • లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ఎందుకు వెళ్లారు?

లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు మరోమారు ఉల్లంఘించారంటూ టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఇవాళ స్వాతి నక్షత్రం సందర్భంగా కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లారంటూ సంబంధిత ఫొటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్న సమయంలో వైసీపీ నాయకుల కోసం దేవాలయాలు ఎందుకు తెరిచారు? అని ఆమె ప్రశ్నించారు. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన  అవసరం ఉందని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News