Punjab: జమ్మూలో మాజీ మహిళా ఎస్సైపై అత్యాచారం!

Ex women SI raped in Punjab

  • జమ్మూలోని వైష్ణోమాత ఆలయానికి వెళ్లిన బాధితురాలు
  • లాక్ డౌన్ కారణంగా ఫిరోజ్ పూర్ లో చిక్కుకుపోయిన వైనం
  • అత్యాచారం చేసిన ఇద్దరు దుండగులు

చట్టం కఠినమైన శిక్షలను విధిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దారుణాలకు ఒడిగడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, రైల్వే పోలీసు అయిన భర్త చనిపోవడంతో ఆయన భార్య (50)కు కారుణ్య నియామకం కింద ఎస్ఐ పోస్టును ఇచ్చారు. ఆ తర్వాత ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

కొన్ని రోజుల క్రితం జమ్మూలోని వైష్ణోమాత ఆలయానికి వెళ్లిన ఆమె... తిరిగి వస్తున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. ఈ  నేపథ్యంలో ఆమెను రైల్వే పోలీసులు షెల్టర్ హోమ్ లో ఉంచారు. షెల్టర్ హోమ్ లో ఆమెపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Punjab
Women SI
Rape
  • Loading...

More Telugu News