Prabhas: ప్రభాస్ తో తలపడనున్న అరవింద్ స్వామి!

Nag Ashwin Movie

  • నాగ్ అశ్విన్ నుంచి భారీ చిత్రం
  • సోషియో ఫాంటసీ కథాంశంతో సాగే సినిమా 
  •  డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు    

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. వైజయంతీ మూవీస్  బ్యానర్ పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉండటంతో, బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల  కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. ప్రభాస్ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది.

భారీ ప్రాజెక్టు కావడం .. తను ఎంతగానో ఇష్టపడే స్టైలీష్ విలన్ పాత్ర కావడం వలన అరవింద్ స్వామి అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Prabhas
Nag Ashwin
Tollywood
  • Loading...

More Telugu News