Junior NTR: రంగంలోకి 'కేజీఎఫ్' దర్శకుడు .. ప్రభాస్ కంటే ముందుగా ఎన్టీఆర్ తోనే!

Prashanth Neel

  • సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్'
  • సీక్వెల్ పనులతో బిజీగా దర్శకుడు
  • ఎన్టీఆర్ తో జరిగిన చర్చలు    

కన్నడలో ఆ మధ్య వచ్చిన 'కేజీఎఫ్' ఇతర భాషల్లోను సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. ఆయన అడిగితే బల్క్ గా డేట్స్ ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' సినిమా పనులతో బిజీగా వున్నాడు. తన తదుపరి సినిమాను ఆయన ప్రభాస్ తో చేయాలనుకున్నాడు. ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్  తో చేయనున్న సినిమా కూడా చాలా సమయం తీసుకోనుంది.

ఈ లోగా ఎన్టీఆర్ తో  చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ వున్నాడట. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ ను కలవడం .. తన దగ్గరున్న లైన్ వినిపించడం జరిగిపోయాయని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయనున్న  సినిమా ఇదేనని అంటున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందని చెబుతున్నారు.  ఈ సినిమా తరువాత కొరటాలకి డేట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నాడని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కెరియర్ పరంగా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.

Junior NTR
Prashanth Neel
Prabhas
  • Loading...

More Telugu News