bandla Ganesh: కేసీఆర్ స్వయంగా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది: బండ్ల గణేశ్

Bandla Ganesh Feels that KCR Come to His Home
  • నిన్న మీడియాతో మాట్లాడిన కేసీఆర్
  • అందరికీ మంచి చెప్పి వెళ్లినట్టుగా ఉంది
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన బండ్ల గణేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నిర్వహించిన మీడియా సమావేశంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. ఆయన మీడియా సమావేశాన్ని చూస్తుంటే, స్వయంగా ఇంటికి వచ్చి, అందరితో మాట్లాడినట్టుగా అనిపించిందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన స్వయానా ఇంటికి వచ్చి అందరికీ మంచి చెప్పి వెళ్లినట్టు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గతంలోనూ కేసీఆర్ మీడియాతో మాట్లాడిన వేళ, బండ్ల గణేశ్, ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే.
bandla Ganesh
Twitter
KCR
Press Meet

More Telugu News