IIT Kanpur: వంద రూపాయలకే కరోనా సేఫ్టీకిట్.. కాన్పూర్ ఐఐటీ ఘనత
- ఐఐటీ కాన్పూరుతో కలిసి అభివృద్ధి చేసిన డాక్టర్ మల్హోత్రా
- పూర్తిగా వైరస్ ప్రూఫ్ మెటీరియల్‌తో కిట్
- వేడి నుంచి ఉపశమనం
కోవిడ్ వారియర్స్ కోసం కాన్పూర్ ఐఐటీ అతి తక్కువ ధరకే అత్యంత సౌకర్యంగా ఉండే సేఫ్టీకిట్‌ను అభివృద్ధి చేసింది. అంతేకాదు, అత్యంత చవగ్గా వంద రూపాయలకే ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీపీఈ కిట్లు ధరించడం వల్ల వైద్య సిబ్బంది విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ కిట్లలో వెంటిలేషన్ లేకపోవడం వల్ల వేడిగా అనిపిస్తోంది. ఇప్పుడీ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలతో కలిసి డాక్టర్ పవన్ మల్హోత్రా ఈ సేఫ్టీకిట్‌ను అభివృద్ధి చేశారు.
పూర్తిగా వైరస్ ప్రూఫ్ మెటీరియల్‌ను ఉపయోగించి ఈ సేఫ్టీకిట్‌ను రూపొందించారు. ఈ కిట్‌లో బూట్లు, మాస్కులు, చేతులకు గ్లౌజులు ఉంటాయి. ప్రయోగశాలలో విజయవంతమైన ఈ కిట్‌ను వినియోగించేందుకు అనుమతి కోసం డీఆర్‌డీఓకు పంపినట్లు డాక్టర్ మల్హోత్రా తెలిపారు.