Telangana: సరాసరిన 16 శాతం వరకూ మద్యం ధరలను పెంచిన కేసీఆర్ సర్కారు!
- చీప్ లిక్కర్ పై 11 శాతం ధర పెంపు
- ధనవంతులు తాగే బ్రాండ్లపై కాస్తంత ఎక్కువ వడ్డన
- పెంచిన ధరలను తిరిగి తగ్గించబోమన్న కేసీఆర్
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా, తాము 50 శాతం, 75 శాతం మేరకు మద్యం ధరలను పెంచాలని భావించలేదని, ధరలను భారీగా పెంచాలని ప్రతిపాదనలు వచ్చినా, దీని వల్ల పేదలకు ఇబ్బంది కలగకుండా చూడాలని భావించి, సరాసరిన 16 శాతం వరకూ ధరలు పెంచుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చీప్ లిక్కర్ పై 11 శాతం ధరలను పెంచామని, డబ్బున్న వారు కొనుక్కునే బ్రాండ్లపై ధరల పెరుగుదల కాస్త ఎక్కువ ఉంటుందని, లాక్ డౌన్ తరువాత పెంచిన ధరలను తిరిగి తగ్గించేది లేదని స్పష్టం చేశారు. ధరల పెంపుపైనా అన్ని వర్గాలతో సమీక్ష జరిపామని వెల్లడించారు.