మ్యూజిక్ టీచర్ గా కనిపించనున్న పూజ హెగ్డే
- అఖిల్ జోడీగా చేసిన పూజ హెగ్డే
- ప్రభాస్ సరసన రొమాంటిక్ లవ్ స్టోరీ
- నాలుగు భాషల్లో విడుదల కానున్న చిత్రం
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ సినిమాలో ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నారు. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.