Avanthi Srinivas: మందుబాబులకు మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి!

Minister Avanti Srinivas Press meet

  • మద్యం తాగే వ్యక్తులు 40 రోజులుగా దానికి దూరం 
  • అందుకే, మద్యం తాగాలనే ఆత్రంతో దుకాణాలకు వెళ్లారు  
  • రెండు రోజుల తర్వాత మద్యం దుకాణాలు ‘ఫ్రీ’ అవుతాయి 

ఏపీలో ఇవాళ మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు భారీ సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. ఈ విషయమై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మద్యం తాగే వ్యక్తులు దాదాపు నలభై రోజులుగా దానికి దూరంగా ఉన్నారని, ఇప్పుడు షాపులు తెరవడంతో ఒక్కసారిగా, మద్యం తాగాలన్న ఆత్రంతో భారీ సంఖ్యలో దుకాణాల వద్దకు చేరుకున్నారని, ఒకటి రెండ్రోజులు పోతే వారి దాహం తీరిపోతుందని చెప్పారు.

రెండు రోజుల తర్వాత మద్యం దుకాణాలు ‘ఫ్రీ’ అయిపోతాయని అన్నారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరిచి మళ్లీ మూసేస్తారేమోనన్న అనుమానంతో కూడా మద్యం దుకాణాల వద్దకు భారీ సంఖ్యలో మందుబాబులు వచ్చారని, మద్యం సీసాలు ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుందామని అనుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘మందుబాబులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే.. ఈ దేశం వదిలేసి మందు ఎక్కడికీ పారిపోదు. ఇక్కడే ఉంటుంది’ అంటూ మంత్రి చమత్కరించారు.

Avanthi Srinivas
Minister
Alchohol
  • Loading...

More Telugu News