Kerala: శభాష్ కేరళ.. వరుసగా రెండో రోజు సున్నా కేసుల నమోదు!

Zero corona cases registered second straight day in Kerala

  • ఈరోజు డిశ్చార్జ్ అయిన పేషెంట్ల సంఖ్య 61
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 34
  • నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారన్న ముఖ్యమంత్రి

మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో కేసులు పెరిగిన తీరు దేశాన్ని బెంబేలెత్తించింది. అయితే, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం ఆ రాష్ట్రాన్ని కరోనా రక్కసి నుంచి బయటపడేలా చేశాయి.

గత రెండు రోజుల నుంచి కేరళలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ఈరోజు 61 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావీలో కరోనా విజృంభిస్తోంది. ఈరోజు ఆ ప్రాంతంలో కొత్తగా 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలోని కేసుల సంఖ్య 632కి చేరుకోగా... 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News