Botsa Satyanarayana: టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు?: మంత్రి బొత్స

Botsa SatyaNarayana Press meet

  • మద్యం ధరలు పెంచడంపై టీడీపీ నేతల విమర్శలు తగదు
  • టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు
  • రాష్ట్రంలో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం

ఏపీలో మద్యం ధరలు పెంచడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబునాయడు, యనమల రామకృష్ణుడు కలిసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని, మద్యం తాగే వారి సంఖ్యను తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగంగానే వాటి ధరలు పెంచామని అన్నారు. టీడీపీ నేతలు ఈ విషయం అర్థం చేసుకోకుండా ఆదాయం కోసమే ప్రభుత్వం చూస్తోందని వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిలదీశారు. ఏపీ దివాలా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News