Sai Dharam Tej: ఈ ఏడాది నా పెళ్లి ఉండొచ్చు: సాయితేజ్

My wedding may be this year says Sai Dharam Tej
  • 33 ఏళ్లు వచ్చేశాయి
  • ఇంట్లో వాళ్లు పెళ్లి పనుల మీదే ఉన్నారు
  • అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమో
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయితేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తేజూ చెబుతున్న మాటలు వింటుంటే ఆయన ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్టు అర్థమవుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజూ మాట్లాడుతూ, తనకు 33 ఏళ్లు వచ్చేశాయని... పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం ఇక కష్టమేనని తెలిపాడు. ఈ ఏడాదే తన పెళ్లి ఉండొచ్చని, ఇంట్లో వాళ్లు అదే పనిలో ఉన్నారని చెప్పాడు. ఏమో.. అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమోనని సరదా వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ... స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి వద్ద ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాడు. లాక్ డౌన్ బోరుగా ఉన్నప్పటికీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పదని చెప్పాడు.
Sai Dharam Tej
Marriage
Tollywood
Love

More Telugu News