Rishi Kapoor: హరిద్వార్ వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో.. రిషికపూర్ అస్థికలను బన్గంగాలో కలిపిన కుటుంబీకులు!

Ranbir Immerse Rishi Kapoors Ashes In Banganga

  • ముంబై వాల్కేశ్వర్ మందిరం చెరువులో నిమజ్జనం
  • కార్యక్రమానికి హాజరైన అలియా భట్
  • హిందూ సంప్రదాయాల ప్రకారం పూజల నిర్వహణ

దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అస్థికలను ఆయన భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ముంబైలోని బన్గంగా తలాల్ (చెరువు)లో ఈరోజు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ ప్రియురాలు, సినీనటి అలియా భట్ కూడా హాజరైంది.

ఈ సందర్భంగా రిషి సోదరుడు రణధీర్ కపూర్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో హరిద్వార్ వెళ్లేందుకు అనుమతులు లభించలేదని చెప్పారు. అందుకే ముంబైలోని బన్గంగాలో అస్థికలను కలిపామని తెలిపారు.

అస్థికలను నిమజ్జనం చేసే సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని పూజలను నిర్వహించారు. బన్గంగా ట్యాంక్ ముంబై మలాబార్ హిల్స్ లోని పురాతన వాల్కేశ్వర్ మందిర ప్రాంగణంలో ఉంది.

Rishi Kapoor
Ashes
Immersion
Bollywood
Ranbir Kapoor
Alia Bhatt
  • Loading...

More Telugu News