West Godavari District: కొవ్వూరులో పోలీసులపై కూలీల దాడి.. లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత!

ruckus in west godavari in ap

  • లాక్‌డౌన్ సడలింపులతో రోడ్లపైకి కూలీలు
  • జాతీయ రహదారిపై నిరసన
  • తమ ప్రాంతాలకు పంపాలని డిమాండ్

లాక్‌డౌన్‌ సడలింపు నేటి నుంచి అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోలీసులపై వలసకూలీలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తమ రాష్ట్రాలకు తమను తిరిగి పంపాలంటూ దాదాపు 300 మంది కూలీలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అయితే, ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేవరకు వారిని తిరిగి పంపబోమని పోలీసులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్వస్థలాలకు పంపాల్సిందేనంటూ బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఏపీలో పలు ప్రాంతాల్లోనూ జనాలు, కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.

  • Loading...

More Telugu News