Pavan Kalyan: పవన్ నష్టాన్ని భర్తీ చేయడం కోసం నితిన్ నిర్ణయం

Chal Mohan Ranga Movie

  • నితిన్ చేతిలో రెండు సినిమాలు
  • పవన్ పట్ల విపరీతమైన అభిమానం
  • 'ఛల్ మోహన్ రంగ' వలన నష్టపోయిన పవన్

మొదటి నుంచి కూడా పవన్ కల్యాణ్ కి తాను వీరాభిమానినంటూ నితిన్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అభిమానంతోనే తన సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. అలాంటి నితిన్ తన కారణంగా పవన్ కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.

గతంలో తన బ్యానర్లో నితిన్ 'ఛల్ మోహన్ రంగా' సినిమా చేశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్  .. పవన్ కల్యాణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన నష్టాలు వచ్చాయి. అయితే తన కారణంగా పవన్ కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలని నితిన్ భావించినట్టుగా సమాచారం. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమాకి పవన్ బ్యానర్ పేరును వాడుకుని, సహ నిర్మాతగా లాభాల్లో ఆయనకి వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు పవన్ అంగీకరిస్తాడా? లేదా? అనేది చూడాలి.

Pavan Kalyan
Nithin
Trivikram Srinivas
  • Loading...

More Telugu News