Rahul Gandhi: ఈ పజిల్‌ను పరిష్కరించేదెలా?: రైల్వే ఛార్జీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Rahul Gandhi attacks Centre for charging train fare from migrant labourers

  • కూలీల నుంచి రైలు టిక్కెట్లు వసూలు చేయడంపై అభ్యంతరం
  • ఓ వైపు కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు
  • మరోవైపు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళం ఇస్తోంది

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన కూలీలను తిరిగి వారి సొంత గ్రామాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైళ్ల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. అయితే, వారి నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News