VV Lakshminarayana: అక్కడ ఫుల్‌టైమ్ రాజకీయాలు లేవు.. అందుకే జనసేన నుంచి బయటకు వచ్చాను: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

V V Lakshminarayana on janasena

  • సమష్టిగా పని చేద్దామని జనసేన పార్టీలో చేరాను
  • ఫుల్‌టైమ్ రాజకీయాల్లో పని చేద్దామని చేరాను
  • అందుకే నేను జనసేన నుంచి బయటకు వచ్చాను ‌

జనసేన పార్టీలో ఎందుకు చేరాను? ఎందుకు బయటకు వచ్చాను? అన్న విషయాలను జనసేన మాజీ నేత వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని, తప్పుడు నిర్ణయం తీసుకున్నానని నేను ఎన్నడూ భావించలేదు. నేను ముందు నుంచి రాజకీయాల్లోకి రావాలని అనుకునే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత వెంటనే రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సమస్యలను గురించి తెలుసుకున్నాను. ప్రజా ప్రతినిధిగా పదవిలో ఉంటే వారి సమస్యలు తీర్చవచ్చని ఆలోచించాను' అని చెప్పారు.

'నేను కూడా వింటున్నాను, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను బీజేపీలో చేరతానని కొందరు అంటున్నారు. మనం ఎక్కడున్నా మార్పు కోసం ప్రయత్నించాలి. ప్రజల జీవన విధానాలను మార్చే క్రమంలో రాజకీయ పార్టీలో చేరాలని నేను భావిస్తే భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు వేస్తాను. సమష్టిగా పని చేద్దామని జనసేన పార్టీలో చేరాను. ఫుల్‌టైమ్ రాజకీయాల్లో పని చేద్దామని జనసేనలో చేరాను. అయితే, అక్కడ ఫుల్‌టైమ్ రాజకీయాలు లేవు. అందుకే నేను జనసేన నుంచి బయటకు వచ్చాను' అని వీవీ లక్ష్మీ నారాయణ చెప్పారు.

VV Lakshminarayana
Janasena
BJP
  • Loading...

More Telugu News