Rajani kanth: ఫుల్ ఖుషీ అవుతున్న ఖుష్బూ!

Rajani Movie

  • రజనీ సరసన మరోసారి ఖుష్బూ
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో హిట్స్
  • ముఖ్య పాత్రల్లో మీనా .. కీర్తి సురేశ్

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో నిన్నటి తరం అందాల కథానాయికగా ఖుష్బూ ఒక వెలుగు వెలిగింది. సీనియర్ స్టార్ హీరోలతో ఆమె వరుస విజయాలను అందుకుంది. అలాంటి ఖుష్బూ తాజాగా రజనీకాంత్ సరసన ఒక సినిమా చేస్తోంది. శివ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమాలో ఈ ఇద్దరిపై ఒక పాట కూడా ఉందట. దాంతో ఖుష్బూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని సమాచారం. గతంలో రజనీ సరసన ఆమె చేసిన 'అన్నామలై' .. 'మన్నన్' .. 'పాండియన్' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మళ్లీ ఇంతకాలానికి రజనీ సరసన నటించే అవకాశం .. ముఖ్యంగా ఇద్దరి కాంబినేషన్లో పాట చిత్రీకరణ ఉండటం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనా .. కీర్తి సురేశ్ కూడా నటిస్తుండటం విశేషం.

Rajani kanth
Khushbu
Meena
Keerthi Syresh
  • Loading...

More Telugu News