Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Rashikhanna opposite Surya in his latest flick

  • బిగ్ ఆఫర్ కొట్టిన రాశిఖన్నా 
  • తమిళ సినిమాలో నిహారిక
  • బన్నీ హిట్ సాంగ్ మరో రికార్డు

*  తెలుగులో అంతగా అవకాశాలు పొందలేకపోతున్న కథానాయిక రాశిఖన్నా ఇప్పుడు తమిళంలో బిగ్ ఆఫర్ ను కొట్టేసింది. స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కథానాయికగా ఎంపికైంది. ఇది ఆమె కెరీర్ కు హెల్ప్ అవుతుందనే చెప్పచ్చు.
*  మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక తమిళంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. స్వాతి దర్శకత్వంలో తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ నటిస్తున్న తాజా చిత్రంలో నిహారిక కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని నిహారిక వెల్లడించింది.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అలాగే ఆ చిత్రంలోని పాటలన్నీ కూడా ఎంతో పాప్యులర్ అయ్యాయి. ముఖ్యంగా 'బుట్టబొమ్మా' పాట మరింతగా ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు యూ ట్యూబ్ లో ఈ పాట 152 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు కొట్టింది.

Rashi Khanna
Surya
Nagababu
Niharika
Allu Arjun
  • Loading...

More Telugu News