Migrants: 'స్వస్థలాలకు తరలింపు' అంశంపై మరింత స్పష్టతనిచ్చిన కేంద్రం

Centre gives clarity over migrants transportation
  • లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు
  • కొన్నిరోజులుగా కార్మికుల తరలింపు
  • పెద్ద ఎత్తున ప్రయాణాలకు తెరదీసిన పౌరులు!
దేశంలో గత కొన్నిరోజులుగా అనేక రాష్ట్రాలు వలస కార్మికులు, కూలీలను వారి స్వరాష్ట్రాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వేస్టేషన్లకు చేరుకుంటుండడం, సొంత వాహనాల్లో ప్రయాణాలకు తెరదీయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై కేంద్రం స్పష్టత నిచ్చింది.

లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసమే తరలింపు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చామని, అంతేతప్ప దేశవ్యాప్త ప్రయాణాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని, ఇతర ప్రదేశాల్లో ఉన్నవాళ్లు అక్కడ సంతృప్తికర సౌకర్యాలు పొందుతుంటే ఇతర ప్రదేశాలకు వెళ్లనవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ ద్వారా తెలియజేసింది.
Migrants
Transport
Centre
Lockdown
Corona Virus

More Telugu News