Chiranjeevi: ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం: హీరో చిరంజీవి

Hero Chirnajeevi statament

  • దేశాన్ని కాపాడేది వీర సైనికులు
  • ‘కరోనా’ కట్టడికి పోరాడుతోంది  ఫ్రంట్ లైన్ వారియర్స్  
  • వీళ్లిద్దరికి మనం రుణపడి ఉన్నామంటూ చిరంజీవి ట్వీట్

‘కరోనా’ కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ..  గగనతలం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు.

సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు,  కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు  వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కరోనా పై పోరాడుతున్న వారికి,  వీర సైనికులకు తాము రుణపడి ఉన్నామని ప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.

Chiranjeevi
Tollywood
Corona Virus
Doctors
flowers
helicopter
  • Error fetching data: Network response was not ok

More Telugu News