Boris Johnson: కుమారుడికి వైద్యుల పేరు పెట్టుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ దంపతులు

boris johnson son name after doctors

  • జాన్సన్, ఆయన సహచరి క్యారీ సైమండ్స్ కి ఇటీవలే పుట్టిన బాబు 
  • బాబుకు విల్‌ఫ్రెడ్‌ లారీ నికోలస్‌ జాన్సన్‌ అనే పేరు
  • ఇందులో ఇద్ద‌రు తాత‌య్య‌ల పేర్లు కూడా కలిసొచ్చేలా నామకరణం

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఆయన సహచరి క్యారీ సైమండ్స్ కి బాబు పుట్టాడని యూకే ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ సహజీవనం చేస్తున్నారు. బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కరోనా కొన్ని రోజుల క్రితం ప్రధాని జాన్సన్‌కు కూడా కరోనా సోకింది.

ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ సమయంలోనే క్యారీ సైమండ్స్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన  బోరిస్‌ జాన్సన్‌ తనకు చికిత్స అందచేసి, ప్రాణం పోసిన వైద్యులకు కృతజ్ఞతగా తనకు జన్మించిన బాబుకు ఆ వైద్యుల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నారు.

తమ బాబుకు విల్‌ఫ్రెడ్‌ లారీ నికోలస్‌ జాన్సన్‌ అని పెట్టారు. ఇందులో ఇద్ద‌రు తాత‌య్య‌ల పేర్లు, బోరిస్‌కు చికిత్స అందించిన‌ మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల పేర్లు ఉన్నాయి.  ఈ విషయాన్ని బోరిస్‌కు కాబోయే భార్య, గర్ల్ ఫ్రెండ్ కేరీ సైమండ్స్‌(32) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపింది. బోరిస్ జాన్సన్‌కు చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు లభించిన గొప్ప గౌరవమని వైద్యులు చెప్పారు.

Boris Johnson
britain
UK
Corona Virus
  • Loading...

More Telugu News