KA Paul: బరువు తగ్గించే వెయిట్ లాస్ సూప్ చేసిన కేఏ పాల్

KA Paul prepares weight loss soup

  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్
  • తన భార్య కోసం సూప్ చేశానన్న పాల్
  • ఒడిశాలో ఉన్నప్పుడు వంట చేసేవాడినని చెప్పిన పాల్

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన ఇండియాకు రాలేకపోతున్నారు. అయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఒక సూప్ ను ఆయన తయారు చేశారు. తన భార్యకు బాగోలేకపోవడంతో ఈ సూప్ ను తయారు చేశానని చెప్పారు. వెయిట్ లాస్ కు కూడా ఈ సూప్ ఉపయోగపడుతుందని అన్నారు.

కొంచెం అనారోగ్యంతో ఉన్న తన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని... భగవంతుని దయ వల్ల ఆమెకు కరోనా సోకలేదని పాల్ తెలిపారు. తాను నార్వేలో ఉన్నప్పుడు ఓ ట్రైనర్ ఉప్పు వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని చెప్పాడని... అయినా తాను వాడుతూనే ఉన్నానని చెప్పారు. 1985లో ఒడిశాలో ఉన్నప్పుడు తాను వంట చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తన భార్యది ఒడిశా అని చెప్పారు.

KA Paul
Soup
Weigh Loss
  • Error fetching data: Network response was not ok

More Telugu News