Jagan: వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన జగన్

Jagan announces 5 laksh exgratia to volunteers family

  • గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన అనురాధ
  • వార్తాపత్రికలో వార్తను చూసి తక్షణమే స్పందించిన సీఎం
  • వెంటనే పరిహారం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశం

విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించారు. కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆమె ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన వార్తను దినపత్రికలో చూసిన ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారు. సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనురాధ  కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ... విపత్తు సమయంలో కూడా కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనురాధ కుటుంబానికి వెంటనే పరిహారం అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News