Donald Trump: ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌తో త్వరలో మాట్లాడతాను: డొనాల్డ్ ట్రంప్

donald trump to call kim

  • కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ కొన్ని రోజులుగా వార్తలు 
  • కొరియా మీడియా ఫొటోలు విడుదల చేయడంతో ట్రంప్ నిర్ణయం
  • దీనిపై సరైన సమయంలో వివరాలు తెలియజేస్తామన్న శ్వేతసౌధం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఈ వారాంతంలో తాను మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. సుమారు మూడు వారాల తర్వాత ప్రజల ముందుకు ఆయన వచ్చినట్లు కొరియా మీడియా పలు ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ  నేపథ్యంలో ఆయనతో మాట్లాడాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. దీనిపై సరైన సమయంలో వివరాలు తెలియజేస్తామని  శ్వేతసౌధం తెలిపింది.  
 
కరోనా విజృంభణ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గ‌త నెల రోజుల నుంచి తన అధికారిక నివాసం శ్వేతసౌధంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచే మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఈ వారం చివర్లో మేరీల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియ‌ల్ రిట్రీట్‌కు ఆయ‌న వెళ్ల‌నున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అక్కడ జరిగే బిజినెస్ మీట్‌లో పలువురు విదేశీ ప్రతినిధులతో ట్రంప్ సమావేశాలు జరుపుతారు. అలాగే పలువురు దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News