Pavan kalyan: చిరూతో 'రౌడీ అల్లుడు' వంటి సినిమా చేయాలనుంది: హరీశ్ శంకర్

Harish Shankar Movie

  • మాస్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్
  •  పవన్ కల్యాణ్ తో రెండోసారి
  • చరణ్ తోను చేయాలనుందన్న హరీశ్  

తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ ఒకరుగా కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు తన కథల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. వీలైనంత వరకూ విజయాలను తన ఖాతాలోకి  చేర్చేస్తాడు. అలాంటి హరీశ్ శంకర్ తాజాగా మాట్లాడుతూ .. "ఇంతవరకూ పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ .. సాయితేజ్ .. వరుణ్ తేజ్ లతో సినిమాలు చేశాను. ఈ అందరి సినిమాలు విజయవంతం కావడం విశేషం.

త్వరలో పవన్ తో మరో సినిమా చేయనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చిరంజీవిగారితో కూడా సినిమా చేయాలనుంది. ఆయన క్రేజ్ కి తగినట్టుగా 'రౌడీ అల్లుడు' తరహా ఎంటర్టైనర్ ను రూపొందించాలనుంది. తప్పకుండా ఆ ప్రయత్నం నెరవేరుతుందనే అనుకుంటున్నాను. ఇక చరణ్ తోను ఒక సినిమా చేస్తే, మెగా హీరోలందరితోను చేసిన సంతృప్తి కలుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.

Pavan kalyan
Harish Shankar
Tollywood
  • Loading...

More Telugu News