Mahesh Babu: మహేశ్ మూవీకి నో చెప్పేసిన కైరా అద్వాని

Parashuram Movie

  • పరశురామ్ తో మహేశ్ బాబు
  •  కైరా అద్వానితో సంప్రదింపులు
  • రెండేళ్ల వరకూ డేట్స్ లేవన్న కైరా    

మహేశ్ బాబు కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'భరత్ అనే నేను' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా కైరా అద్వాని అందాల సందడి చేసింది. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అభిమానులు అనుకున్నారు.

ఈ కారణంగానే మళ్లీ ఈ జోడీని మరోసారి తెరపై చూపించాలని దర్శకుడు పరశురామ్ అనుకున్నాడు. మహేశ్ బాబుతో తాను చేయనున్న సినిమా కోసం ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. కైరా అద్వానిని కలిసి మాట్లాడటం కూడా జరిగిందట.

అయితే ప్రస్తుతం తన చేతిలో నాలుగు బాలీవుడ్  సినిమాలు వున్నాయనీ, వాటిని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టానని అందట. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి రెండేళ్లు పడుతుందనీ, ఈ లోగా మరో సినిమాను కమిట్ కాలేనని చెప్పిందట. దాంతో పరశురామ్ మరో కథానాయిక కోసం అన్వేషణ సాగిస్తున్నట్టుగా సమాచారం.

Mahesh Babu
Kiara Adwani
parashuram Movie
  • Loading...

More Telugu News