Jagan: జనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది.. క్వారంటైన్ కేంద్రాలను పెంచండి: జగన్ ఆదేశం

Increase quarantine centers says Jagan

  • విదేశాల నుంచి వచ్చే వారిని హోం క్వారంటైన్ కు తరలించండి
  • గుజరాత్ నుంచి వచ్చిన వారికి పూల్ శాంపిల్స్ చెక్ చేయండి
  • టెలి మెడిసిన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సమన్వయం ఉండాలి

లాక్ డౌన్ సడలింపుతో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి జనాలు భారీగా వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్లను పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్వారంటైన్ లో పరిశుభ్రత, భోజనం, సదుపాయాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే వారికి  నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారందరినీ హోం క్వారంటైన్ కు తరలించాలని జగన్ సూచించారు. గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చెక్ చేసిన ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. టెలి మెడిసిన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని చెప్పారు. టెలి మెడిసిన్ కు ఫోన్ చేస్తే ప్రిస్క్రిప్షన్ తో పాటు విలేజ్ క్లినిక్ ద్వారా మందులు బాధితుల ఇళ్లకు చేరాలని అన్నారు.

  • Loading...

More Telugu News