Tapsee Pannu: ఇదే ఆలింగనాన్ని మరోసారి పొందుతాను: రిషికపూర్ గురించి భావోద్వేగంతో తాప్సీ

Heroin Tapsee Emotional Post on Rishi Kapoor

  • రిషి కపూర్ కు నివాళిగా భావోద్వేగ పోస్ట్
  • హ్యాట్రిక్ మూవీలో నటించే అవకాశం దక్కకుండా  పోయింది
  • ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తారన్న తాప్సీ

పక్కా నిజాయతీగా ఉండడంలో తనను మించిన కో స్టార్ రిషి కపూర్ ఒక్కడేనని హీరోయిన్ తాప్సీ వ్యాఖ్యానించింది. రిషి కపూర్ మరణ వార్త తనను కలచివేసిందని చెబుతూ, 'ముల్క్' చిత్రంలో తామిద్దరమూ కలిసి నటించామన్న విషయాన్ని గుర్తు చేసుకుంది.

ఆ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన తాప్సీ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని, ఏ పాత్రనైనా అవలీలగా పోషించే అటువంటి నటుడిని తాను ఎక్కడా చూడలేదని పేర్కొంది. "ఆయనతో రెండుసార్లు పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన తన జీవితంలో ఎంతో వినోదాత్మకమైన సినిమాల్లో నటించారు. మీతో మూడోసారి నటించే అవకాశం తప్పకుండా వస్తుందని భావించాను. ఎక్కడో చోట మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. ముఖంలో చిర్నవ్వుతో కూడిన ఇదే ఆప్యాయపూర్వక ఆలింగనాన్ని మరోసారి పొందుతాను" అంటూ భావోద్వేగ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టింది.

Tapsee Pannu
Rishi Kapoor
Instagram
  • Loading...

More Telugu News