Cat: తల్లి ప్రేమంటే ఇదే... అనారోగ్యంతో ఉన్న తన కూనను ఆసుపత్రికి మోసుకెళ్లిన పిల్లి!

Mother Cat Carries Sick Kitten to Hospital

  • టర్కీలోని ఇస్తాంబుల్ లో ఘటన
  • కూన నీరసించిపోవడంతో ఆసుపత్రికి
  • వైద్యుల చుట్టూ తిరుగాడుతూ బాధను తెలిపిన తల్లి
  • చికిత్స తరువాత కోలుకున్న కూన

తల్లి ప్రేమ అనేది విశ్వజనీనం!
బిడ్డ అనారోగ్యంతో అల్లాడుతుంటే, ఏ తల్లి అయినా తల్లడిల్లుతుంది. మనుషులైనా, జంతువులైనా తల్లిలో ఉండే ప్రేమ ఒకటే. ఈ చిత్రాలు కూడా అందుకు నిదర్శనంగా నిలిచేవే. ఇస్తాంబుల్ లోని టర్కీలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఓ పిల్లి, దాని కూన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

హుషారుగా ఉండే తన బిడ్డ నీరసించి పోవడంతో, ఆందోళనకు గురైన తల్లి పిల్లి, దాన్ని నోట కరచుకుని ఆసుపత్రికి పరుగెత్తింది. వైద్యుల ముందు కూనను ఉంచి, వారి చుట్టూ తిరిగింది. పిల్లి బాధను అర్థం చేసుకున్న వైద్యులు, వెంటనే కూనకు వైద్య సాయం అందించారు. దీంతో ఆ కూన తిరిగి శక్తిని కూడదీసుకుని, ఆరోగ్యంతో కనిపిస్తూ, ఆటలాడగా, ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిత్రాలను వెర్వీ ఓజ్కాన్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.

Cat
Hospital
Istanbul
Viral Pics
Kitten
  • Error fetching data: Network response was not ok

More Telugu News