France: దారుణంగా పడిపోయిన ఫ్రాన్స్ వృద్ధిరేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి!

France worst growth rate first time after 1949

  • 5.8 శాతం తగ్గిన ఫ్రాన్స్ జీడీపీ
  • నిలిచిపోయిన అప్రాధాన్య కార్యకాలపాలు 
  • లాక్ డౌన్ కారణమన్న ఇన్సీ

ఫ్రాన్స్ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతం తగ్గింది. 1949 తర్వాత జీడీపీ ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌనే ఇందుకు కారణమని నేషనల్ స్టాటిస్టిక్స్ ఇనిస్టిట్యూట్ 'ఇన్సీ' తెలిపింది.

లాక్‌డౌన్ కారణంగా అప్రాధాన్య కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఫలితంగా జీడీపీ వృద్ధి ప్రతికూలంగా నమోదైందని ఇన్సీ పేర్కొంది. పైన పేర్కొన్న త్రైమాసికంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి 5.5 శాతం తగ్గగా, నిర్మాణ రంగం 12.6 శాతం దిగజారింది. ఇక, పరికరాలు, తయారీ వస్తువుల వృద్ధి 4.8 శాతం, 5.6 శాతం తగ్గింది. మార్కెట్ సేవల ఉత్పత్తి కూడా 5.7 శాతం తగ్గినట్టు ఇన్సీ వివరించింది. ఈ త్రైమాసికంలో విదేశీ అమ్మకాలు క్షీణించడం, దిగుమతులు తగ్గడం కూడా జీడీపీ క్షీణతకు ఒక కారణమని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

France
GDP
Corona Virus
  • Loading...

More Telugu News