Nagarjuna: రిషీ జీ, మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు: నాగార్జున

Nagarjuna responds after demise of Rishi Kapoor
  • రిషీ కపూర్ మరణంపై నాగ్ స్పందన
  • ఎప్పటికీ మిస్సవుతుంటాం అంటూ ట్వీట్
  • రిషీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
  • సినీ కుటుంబానికి తీరని లోటు అంటూ పూరీ జగన్నాథ్ స్పందన
బాలీవుడ్ దిగ్గజం రిషీ కపూర్ మృతి వార్తతో టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. రిషీ ఇకలేడని తెలియడంతో అగ్రహీరో నాగార్జున విషాదంలో మునిగిపోయారు. 'మిమ్మల్ని మిస్సవుతున్నాం రిషీ జీ. అయినా మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను' అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

అటు, దర్శకుడు పూరీ జగన్నాథ్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. వరుసగా ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ మరణించడం పట్ల దిగ్భ్రాంతికి లోనయ్యారు. "మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలియదు. హఠాత్తుగా మా జీవితాల్లోంచి అదృశ్యమయ్యారు. రిషీ గారు, ఇర్ఫాన్ గారు మిమ్మల్ని మిస్సవుతున్నాం. మీ మృతి మన సినీ కుటుంబానికి తీరని లోటు. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం" అని పేర్కొన్నారు.
Nagarjuna
Rishi Kapoor
Puri Jagannadh
Bollywood
Tollywood

More Telugu News