Chiranjeevi: చిరంజీవిగారు నన్ను మెచ్చుకున్నారు: 'జబర్దస్త్' అదిరే అభి

Adire Abhi Mivie

  • అదిరే అభికి మంచి క్రేజ్
  • సినిమాల్లోను వస్తున్న అవకాశాలు
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదిరే అభి  

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో అదిరే అభి ఒకరు. ఆయనకి గల క్రేజ్ కారణంగా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ... 'పాయింట్ బ్లాంక్' అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించాను. ఓ నెల రోజుల లోపునే ఆ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము.

రెండు మూడు రోజుల్లో టీజర్ రిలీజ్ చేయాలని భావించాము. ఓ పెద్ద సెలబ్రిటీతో మాట్లాడటం కూడా జరిగిపోయింది. అంతలో కరోనా కాలు పెట్టేసింది. ఈ సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే, చిరంజీవి గారిని కలుసుకున్నాను. నేను హీరోగా చేస్తున్నాననీ, పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నానని చిరంజీవి గారికి చెప్పాను. పోలీస్ పాత్రకి తగినట్టుగా వున్నావంటూ, ఫిట్ నెస్ విషయంలో నేను తీసుకుంటున్న శ్రద్ధను మెచ్చుకున్నారు. అప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు" అని  చెప్పుకొచ్చాడు.

Chiranjeevi
Kajal Agarwal
Charan
Adire Abhi
  • Loading...

More Telugu News