david warner: భార్యతో కలసి 'బుట్టబొమ్మ' పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్!

david warner tiktok dancing for ButtBomma
  • వైరల్ అవుతోన్న వీడియో
  • సన్‌రైజర్స్ జెర్సీలో స్టెప్పులు
  • భార్యతో కలిసి టిక్‌టాక్‌లు చేస్తోన్న క్రికెటర్‌
‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు అదరగొట్టేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్‌ సాధిస్తూ అల్లు అర్జున్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇదే పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె కూడా స్టెప్పులు వేస్తూ కనపడింది.

బుట్టబొమ్మ పాటకు ఆయన చేసిన టిక్‌టాక్‌ వీడియో అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలోనే వార్నర్ ఈ డ్యాన్స్ చేయడం గమనార్హం. కాగా, కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నాడు.
david warner
Cricket
Allu Arjun

More Telugu News