Rishi Kapoor: రిషి కపూర్ చివరి కోరిక ఇదే!

Rishi Kapoor Last Wish

  • వైద్య సిబ్బందిపై దాడులు చేయవద్దు
  • ఏప్రిల్ 2న పెట్టిన చివరి ట్వీట్ లో రిషి కపూర్
  • కన్నుమూసే వరకూ నవ్వుతూనే గడిపిన సీనియర్ హీరో

కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్, ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాను కన్నుమూసే చివరి క్షణం వరకూ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో నవ్వుతూ, సరదాగా గడిపిన ఆయన, ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆయన, ఈ ట్వీట్ లో ఆయన తన అభిమానుల ముందు ఓ విన్నపాన్ని ఉంచారు. అదే ఇప్పుడాయన చివరి కోరికగా మిగిలింది.

"క‌రోనా వైర‌స్‌ ను తరిమేసేందుకు నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, న‌ర్సులు, పోలీసుల ప‌ట్ల హింస‌ను మానుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు చేతులెత్తి విజ్ఞ‌ప్తి చేస్తున్నా. మ‌న‌కోసం వారు ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నారు. అలాంటి వారిపై దాడుల‌కు దిగవద్దు... జై హింద్" అని రిషి కపూర్ కోరారు. ఆ తరువాత, ఆయన మరో ట్వీట్ ను పెట్టలేదు.

Rishi Kapoor
Last Wish
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News