rishi kapoor: ప్రతిభకు రిషికపూర్‌ పవర్ హౌస్‌ లాంటి వారు: ప్రధాని మోదీ నివాళులు

PM Narendra anguished by Rishi Kapoors death

  • రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి
  • స్ఫూర్తివంతమైన, చురుకైన వ్యక్తి
  • ఆయనను కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను
  • ఆయన మృతితో కలత చెందాను

బాలీవుడ్ నటుడు రిషి కపూర్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన మృతితో కలత చెందానని ట్వీట్ చేశారు.  

'రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్ఫూర్తివంతమైన మనిషి, చురుకైన వ్యక్తి. ఆయన టాలెంట్‌కు పవర్ హౌస్‌ లాంటి వారు. సామాజిక మాధ్యమాల్లో ఆయనతో చేసిన చర్చ, ఆయనను స్వయంగా కలిసిన సందర్భాలను నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను' అని మోదీ ట్వీట్ చేశారు.

'ఆయనకు సినిమాలు, భారత అభివృద్ధి కార్యక్రమాలు అంటే మక్కువ ఎక్కువ. ఆయన మృతితో కలత చెందాను. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి' అని మోదీ ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News