Kruti Sanan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kruti Sanan about career

  • అవకాశాల గురించి కృతి సనాన్
  • 'ఎఫ్-3'లో మరో హీరో కూడా!
  • నితిన్ కి హీరోయిన్ ఖరారు    

 *  ఇండస్ట్రీలో ఎవరూ లేకుండా వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం అంటోంది కథానాయిక కృతి సనాన్. 'స్టార్లుగా వెలుగొందిన వారి పిల్లలకి ఇక్కడ ఏ భయమూ అక్కర్లేదు. తొలి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఛాన్స్ వచ్చేస్తుంది. అది వాళ్లకున్న అవకాశం. వెనకాల ఎవరూ లేని మాలాంటి వారికి కెరీర్ పట్ల భయం భయంగానే వుంటుంది. మొదట్లో బాగా నిరూపించుకోవాలి. లేకపోతే రెండో సినిమాయే రాదు' అని చెప్పుకొచ్చింది.    
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తాడట. అయితే, అది గెస్ట్ రోల్ అనీ, ప్రముఖ హీరో ఆ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.
*  ప్రస్తుతం శర్వానంద్ సరసన 'శ్రీకారం' చిత్రంలో నటిస్తున్న అందాలభామ ప్రియాంక అరుల్ మోహన్ త్వరలో నితిన్ పక్కన నటించనుంది. హిందీ చిత్రం 'అంధాదూన్'ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ప్రియాంకను కథానాయికగా తీసుకుంటున్నట్టు సమాచారం.  

Kruti Sanan
Venkatesh
Varun Tej
Nithin
  • Loading...

More Telugu News