Sekhar Kammula: శేఖర్ కమ్ముల నుంచి థ్రిల్లర్ మూవీ?

Sekhar kammula Movie

  • ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల
  • తాజా చిత్రంగా రానున్న 'లవ్ స్టోరీ'
  • తదుపరి సినిమాపై ఉహాగానాలు

తెలుగు తెరపై ప్రేమకథలను కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడిగా శేఖర్  కమ్ములకు ఎంతో మంచి పేరు వుంది. 'ఆనంద్' .. 'గోదావరి' .. 'ఫిదా' వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'లవ్ స్టోరీ' రూపొందుతోంది. చైతూ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తరువాత సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది. తన తదుపరి సినిమాను ఆయన ఎవరితో చేయనున్నాడనే కుతూహలం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. కొత్తదనం కోసం తొలిసారిగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలలో .. సున్నితమైన భావాలను తెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఒక్కసారిగా రూట్ మార్చాడనే ప్రచారంలో ఎంతవరకూ నిజముందనేది చూడాలి.

Sekhar Kammula
Love Story Movie
Tollywood
  • Loading...

More Telugu News