Sai Pallavi: కురచ దుస్తులు వేసుకోమంటే ఆ సినిమా వదులుకున్నట్టే: సాయిపల్లవి

sai pallavi

  • సహజంగా కనిపించడానికి ఇష్టపడతాను
  • వయ్యారాలు ఒలకబోయడం నా వల్ల కాదు
  • వదులుకున్న సినిమాలు చాలానే వున్నాయన్న సాయిపల్లవి

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. నటనకి అవకాశం వుండే కథలను .. సహజత్వానికి దగ్గరగా వుండే పాత్రలను మాత్రమే సాయిపల్లవి ఎంచుకుంటూ వెళుతోంది. గ్లామరస్ గా కనిపించే విషయంలో మొదటి నుంచి కూడా తను అనుకున్న పరిధిని దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ .. 'మొదటి నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతాను. కురచ దుస్తులు వేసుకోవడం .. శ్రుతిమించిన వయ్యారాలు ఒలకబోయడం నాకు ఇష్టం ఉండదు. 'ఫిదా' సినిమాలో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను .. ఆ సన్నివేశానికి అది అవసరం. అలాగే మరో సినిమాలో కనిపించాలంటే మాత్రం ఒప్పుకోను .. వత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకోవడమే జరుగుతుంది. అలా వదులుకున్న సినిమాలు చాలానే వున్నాయి" అంటూ చెప్పుకొచ్చింది.

Sai Pallavi
Actress
Tollywood
  • Loading...

More Telugu News