Allu Arjun: బన్నీతో స్టెప్పులు వేయనున్న దిశా పటాని?

Pushpa Movie

  • 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయం
  • హిందీ సినిమాలతో బిజీ
  •  సుకుమార్ సినిమా కోసం సంప్రదింపులు

తెలుగు తెరకి 'లోఫర్' సినిమాతో 'దిశా పటాని' పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ అవకాశాలనే కాదు .. అభిమానులను సంపాదించుకుంది. అలాంటి దిశా పటానీని మళ్లీ తెలుగు తెరకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు. ఇక ఐటమ్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. సుకుమార్ .. దేవిశ్రీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ దుమ్మురేపేశాయి. అలాగే ఈ సినిమాలోను మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో బన్నీతో కలిసి దిశా పటాని మెరవనుందని అంటున్నారు.

Allu Arjun
Rashmika Mandanna
Disha patani
  • Loading...

More Telugu News