Priyanka Arul Mohan: నితిన్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్

Andhadhun Movie Remake

  • హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
  • జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్
  • క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో ఈ నాజూకు అందాన్ని తెరపై చూసిన కుర్రాళ్లు గ్లామర్ పరంగా నూటికి నూరు మార్కులు ఇచ్చేశారు. తాజాగా ఈ సుందరి నితిన్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. హిందీలో 'టబు' చేసిన పాత్రకిగాను రాధికా ఆప్టే ను ఎంపిక చేసుకున్నారు. ఇక కథానాయిక పాత్రకి గాను ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో ఇక్కడ ప్రియాంక అరుళ్ మోహన్ కెరియర్ ఊపందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Priyanka Arul Mohan
Nithin
Andhadhun Remake
  • Loading...

More Telugu News