Kangana Ranaut: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని.. ఛాన్స్ మిస్ చేసుకున్నా: కంగనా రనౌత్

I missed Pokiri movie chance says Kangana Ranaut
  • 'పోకిరి'లో హీరోయిన్ అవకాశం ముందుగా నాకే వచ్చింది
  • ఈ సినిమా ఆడిషన్స్ కు కూడా వెళ్లాను
  • 'గ్యాంగ్ స్టర్'కు డేట్లు ఇవ్వడం వల్ల అవకాశం వదులుకున్నా
కంగనా రనౌత్... బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ గానే కాకుండా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. అంతేకాదు, హీరోలకు సైతం సవాళ్లు విసురుతూ, ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ బీటౌన్ ను షేక్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' చిత్రంపై మాట్లాడింది.

'పోకిరి' సినిమాలో హీరోయిన్ ఆఫర్ తొలుత తనకే వచ్చిందని కంగన తెలిపింది. తాను 'గ్యాంగ్ స్టర్' ఆడిషన్స్ కు వెళ్లిన సమయంలో 'పోకిరి' ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయని... రెండింటికీ తాను హాజరయ్యానని చెప్పింది. రెండు సినిమాల్లో తనకు అవకాశం వచ్చిందని... అయితే, 'గ్యాంగ్ స్టర్'కు ముందుగానే  డేట్లు ఇచ్చేయడంతో, 'పోకిరి' సినిమా చేయలేకపోయానని తెలిపింది. 'పోకిరి' సినిమాలో తాను నటించి ఉంటే... టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయ్యేదాన్నని చెప్పింది..

అయితే, ఆ తర్వాత పూరి జగన్నాథ్ నిర్మించిన 'ఏక్ నిరంజన్' చిత్రంలో కంగన నటించింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కంగన నటించింది. అయితే ఊహించిన స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని సాధించలేకపోయింది.
Kangana Ranaut
Bollywood
Tollywood
Pokiri Movie
Mahesh Babu
Puri Jagannadh

More Telugu News