RaviChandran: చనిపోవడానికి ముందు రోజు సిల్క్ స్మిత కాల్ చేసింది: కన్నడ హీరో రవిచంద్రన్

Ravichandran

  • సిల్క్ స్మిత నాకు మంచి ఫ్రెండ్
  • ఆమె కాల్ ను రిసీవ్ చేసుకోలేకపోయాను
  • మర్నాడు ఆమె మరణవార్త వినవలసి వచ్చిందన్న సీనియర్ హీరో  

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో మత్తు కళ్ల సుందరిగా సిల్క్ స్మిత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఒక వైపున ప్రధాన పాత్రలను .. ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, ఐటమ్ సాంగ్స్ తోను అదరగొట్టేసింది. అలాంటి సిల్క్ స్మిత హఠాన్మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

తాజాగా ఆమె గురించి కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ ప్రస్తావించాడు. "సిల్క్ స్మిత నాకు మంచి స్నేహితురాలు. తరచూ ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. అలాగే ఒక రోజున ఆమె నుంచి నాకు కాల్ వచ్చింది. అయితే ఆ సమయంలో నేను బిజీగా ఉండటం వలన, తరువాత మాట్లాడవచ్చులే అనుకున్నాను. ఆ మరునాడే ఆమె మరణ వార్తను వినవలసి వచ్చింది. సిల్క్ స్మిత కాల్ చేసినప్పుడు నేను వెంటనే స్పందించి వుంటే, పరిస్థితి వేరేలా ఉండేదని ఇప్పటికీ అనుకుంటూ వుంటాను .. బాధపడుతూ వుంటాను" అని చెప్పుకొచ్చాడు.

RaviChandran
Silk Smitha
KollyWood
  • Loading...

More Telugu News