USA: యూఎస్ ఎన్నికల్లో జోయ్ బిడెన్ కు పూర్తి మద్దతు ప్రకటించిన హిల్లరీ క్లింటన్!

Hillary Clinton Supports Joe  Biden

  • నవంబర్ లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు
  • లైవ్ వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన హిల్లరీ
  • ట్రంప్ కు సరైన పోటీ ఇచ్చేది బిడెన్ మాత్రమేనని వ్యాఖ్య

ఈ సంవత్సరం నవంబర్ లో అమెరికాకు జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జోయ్ బిడెన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు హిల్లరీ క్లింటన్ ప్రకటించారు. "మీరు అధ్యక్షుడు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరే అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్న ఎంతో మందికి నా గొంతు కూడా తోడవుతుంది" అని ఓ లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో యూఎస్ మాజీ తొలి మహిళగానూ, అమెరికా విదేశాంగ మంత్రిగానూ సేవలందించిన హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. కేవలం టీవీల్లో ఆటలాడే అధ్యక్షుడు కాకుండా నిజమైన అధ్యక్షుడు వస్తే ఎలా ఉంటుందో ఊహించాలని కోరిన హిల్లరీ, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరైన పోటీని ఇవ్వగలిగేది బిడెన్ మాత్రమేనని అభివర్ణించారు.

USA
President Poll
Hillary Clinton
Joe Biden
Donald Trump
  • Loading...

More Telugu News