Vijay Devarakonda: ఇకపై అలాంటి పాత్రలు చేయను: హీరోయిన్ రాశి ఖన్నా

World Famous Lover Movie

  • ఆ పాత్రను చేసి వుండకూడదు
  • పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టే పాత్రలు చేయను
  • ఇకపై హద్దులు దాటే సీన్స్ చేయనన్న రాశి ఖన్నా

తెలుగు తెరపై అందాల కథానాయికగా రాశి ఖన్నాకి మంచి క్రేజ్ వుంది. కెరియర్ విషయంలో ఆమె ఆచి తూచి వ్యవహరిస్తూ, నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళుతోంది. అలాంటి రాశి ఖన్నా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది. తప్పనిసరికాని సీన్స్ లో ఆమె అలా కనిపించడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఆమె అంతగా రిస్క్ చేసినా ఆ పాత్రకి ఎలాంటి గుర్తింపు రాకపోవడం నిరాశను కలిగించే విషయమే. ఆ సినిమా విజయవంతం కాకపోవడం ఆమెను మరింత డీలాపడేలా చేసింది. ఆ పాత్రను గురించి తాజాగా రాశి ఖన్నా స్పందిస్తూ .. "ఆ సినిమాలో నేను ఆ పాత్రను చేసి వుండకూడదు. ఆ పాత్రను ఒప్పుకుని ఒక రకంగా పొరపాటు చేశాను. నేను చేసిన ఆ పాత్ర నా పేరెంట్స్ ను కూడా బాధపెట్టిందని గ్రహించాను. అలాంటి పాత్రలను చేయకూడదనీ, గ్లామర్ పరంగా హద్దులు దాటని పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చింది.

Vijay Devarakonda
Rasi Khanna
World Famous Lover
  • Loading...

More Telugu News