raghavendra rao: ఏప్రిల్ 28.. నా జీవితంలో ఓ మరుపురాని రోజు: వివరించిన రాఘవేంద్ర రావు

raghavendra rao on april 28

  • ఏప్రిల్‌ 28న 'ఎన్టీఆర్' అడవి రాముడు విడుదల
  • నా సినీ ప్రస్థానం మరో మెట్టు ఎక్కిన రోజు
  • ఏప్రిల్‌ 28నే బాహుబలి కూడా విడుదల
  • అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి సాహో అనిపించింది

తన సినీ జీవితంలో ఏప్రిల్‌ 28 మరపురాని రోజని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు తెలిపారు. సీనియర్‌ ఎన్టీఆర్‌తో తన సినీ ప్రస్థానం మరో మెట్టు ఎక్కిన రోజని ఆయన చెప్పారు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజని తెలిపారు. ‌43 ఏళ్ల  క్రితం అడవి రాముడు విడుదలైన రోజని వివరించారు.

రామారావును గుర్తు చేసుకుంటూ ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాఘవేంద్ర రావు ఓ ప్రకటన చేశారు. అలాగే, బంగారానికి తావి అబ్బినట్లు ఏప్రిల్‌ 28 నాడే తన సమర్పణలో బాహుబలి చిత్రం విడుదల కావడం తనకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సాహో అనిపించిందని గుర్తు చేశారు.

 ఏప్రిల్‌ 28 గురించి రాఘవేంద్ర రావు మాటల్లో...                                               
                                                                            

raghavendra rao
Tollywood
bahubali
Rajamouli
  • Loading...

More Telugu News